Wednesday, 7 July 2021

పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు వినియోగించరాదు.

పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు వినియోగించరాదు.

🔅 జాగ్రత్తలు పాటిస్తూ డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించాలి

🔅 ఇతరుల వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించకూడదు.

🔅 ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, పోలీసు స్టేషన్లు, ఎయిర్ పోర్ట్ ల వద్ద, ఇతర నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్ లను వాడితే కఠిన చర్యలు.


కనుచూపు మేరలో మాత్రమే డ్రోన్ ను ఎగిరేలా నియంత్రిస్తుండాలి. అనుమతించిన ఎత్తు లోనే డ్రోన్ ఉండేలా చూసుకోవాలి.

పగటి పూట (సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోగా) మాత్రమే వినియోగించాలి.

డిజిటల్ స్కై ప్లాట్ ఫామ్ ద్వారా అనుమతి తప్పనిసరిగా పొందాలి.

డ్రోన్ ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా మంచి కండిషన్ లో ఉండేలా చూసుకోవాలి.

ఫ్లైయింగ్ మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలి.

డ్రోన్ నిషేధిత ప్రాంతాలపై అవగాహన కలిగి ఉండాలి.

ఇతరుల వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించకూడదు.


చేయకూడనివి మరియు తప్పకుండా పాటించవలసిన నియమాలు:-

భూమట్టం నుండి 400 అడుగుల (120 మీ) కంటే ఎక్కువ డ్రోన్లను ఎగురవేయరాదు.

విమానాశ్రయాలు, హెలిప్యాడ్ ల సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో డ్రోన్ ను వినియోగించరాదు.

జనసమూహాలుండే ప్రదేశాలు, బహిరంగ కార్యక్రమాలు, జనంతో ఉన్న స్టేడియంలలో డ్రోన్ లు వినియోగించరాదు.

ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక స్థావరాలపై, నో-డ్రోన్ సమీపంలో డ్రోన్‌ ను ఎగురవేయరాదు.

ప్రైవేట్ ఆస్తుల సమీపంలో వారి అనుమతి లేకుండా చిత్రీకరించకూడదు.

AAI/ADC 24 గంటల ముందు దాఖలు చేయకుండా విమానాశ్రయాల సమీపంలో నియంత్రిత ఆకాశ మార్గంలో డ్రోన్‌ ను ఎగురవేయరాదు.

ప్రమాదకరమైన పదార్థాలను తీసుకెళ్లకూడదు లేదా కింద పడవేయకూడదు.

మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి డ్రోన్ వినియోగించకూడదు.

కదిలే వాహనాల నుండి డ్రోన్ ను ఎగరవేయకూడదు.


          పై నిభందనలను డ్రోన్ ఆపరేట్ చేయువారు తప్పనిసరిగా DGCA (Directorate General of Civil Aviation) నిభందనలను పాటించాలి. యజమానులు, ఉపయోగించువారు నిభందనలను అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలతో పాటు కేసు నమోదు చేయబడును.

          డ్రోన్ కలిగిన వారు మీ సంబందిత పోలీస్ స్టేషన్ ల యందు మీ డ్రోన్ సమాచారంతో పాటు మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా తెలిపి రిజిస్టర్ చేయించుకోవాలి. 

          స్థానికేతరాలు మీ ప్రాంతం యందు డ్రోన్ ఉపయోగించినా అట్టి సమాచారాన్ని కూడా పోలీస్ వారికి తెలియపరచాలి. 

          డ్రోన్ కెమెరాలను ఏదైనా కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి ముందస్తుగా పోలీస్ వారి అనుమతి పొందాలి.

          పై తెలిపిన నిభందనలను పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలి.

No comments:

Post a Comment

Diary 2026 - About APPEEOA

  The information pertaining to this section is under compilation and will be notified shortly.